Thursday, May 8, 2025
Homeఆటలుశ్రీకాంత్‌, అస్మిత్‌ శుభారంభం

శ్రీకాంత్‌, అస్మిత్‌ శుభారంభం

- Advertisement -

– తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
తైపీ సిటీ(చైనా):
తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌, అస్మిత్‌ శెట్టి, మన్నేపల్లి శుభారంభం చేయగా.. మైస్మన్‌, సుబ్రహ్మణ్యం తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో శ్రీకాంత్‌ 21-16, 21-15తో సుబ్రహ్మణ్యంపై, అస్మిత్‌ శెట్టి 21-17, 21-18తో చెన్‌ లీ(తైపీ)పై విజయం సాధించారు. ఇక మన్నేపల్లి 21-17, 19-21, 21-12తో వాంగ్వా(జపాన్‌)పై గెలుపొందగా.. మైస్మన్‌ 21-23, 12-21తో కెనడాకు చెందిన యంగ్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇక మహిళల సింగిల్స్‌లో హుడా సంచలనం సృష్టించింది. భారత్‌కే చెందిన అనుపమ ఉపాధ్యాయపై 21-13, 21-17తో విజయం సాధించి రెండోరౌండ్‌కు చేరింది. మరో పోటీలో ఆకర్షీ కశ్యప్‌ 9-21, 12-21తో యంగ్‌(తైపీ) చేతిలో, అన్మోల్‌ ఖర్బ్‌ 17-21, 12-21తో నితిక్రరు(ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -