నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని మూడవ అంగన్వాడి సెంటర్లో బుధవారం మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ కళావతి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ శ్రీమంతం కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు బాలింతలకు తల్లులకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పౌష్టిక్ ఆహారం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత, అంగన్వాడి టీచర్లు, ఆయాలు గర్భిణీలు బాలింతలు తల్లులు పాల్గొన్నారు.
- Advertisement -