నవతెలంగాణ – ఆలేరు రూరల్
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు ఆదివారం బయలుదేరారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు చౌడబోయిన పరశురాములు, రమేష్, అంజయ్య, పోతారం అంజయ్య, మహేందర్, గిరబోయిన స్వామి, నమిలె కనకరాజు, రాజు, అలాగే ఆలేరు మండల సీపీఐ పార్టీ కార్యదర్శి చౌడబోయిన కనకయ్య సభకు హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాసపురం గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు భూమికోసం, భుక్తికోసం పేదల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేశారని అన్నారు.దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులు పేదల సమస్యలపై పోరాడుతూ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.
కమ్యూనిస్టు పార్టీని కాపాడుతూ, పేదల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టు నాయకులకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నారు.



