Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీపాదరావు చిరస్మరణీయుడు

శ్రీపాదరావు చిరస్మరణీయుడు

- Advertisement -

మల్హర్ లో ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు చిరస్మరణీయుడని పలువురు కొనియాడారు. ఆయన87వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఎంపిడిఓ కార్యాలయం, కొయ్యుర్, తాడిచెర్ల, పెద్దతూండ్ల, ఎడ్లపల్లి, రుద్రారం, గాదంపల్లి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. కొయ్యుర్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, మహిళ అధ్యక్షురాలు,కొయ్యుర్ సర్పంచి కొండ రాజమ్మ ఆధ్వర్యంలో శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు  ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప ప్రజానాయకుడని తెలిపారు. స్పీకర్ హోదాలో ఆయన చూపిన క్రమశిక్షణ, పారదర్శకత, నైతిక విలువలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన చిరస్మరణీయులన్నారు. ఈతరం యువత ఆయన సేవాభావం, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ క్రాంతికుమార్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, సర్పంచ్ లు జంగిడి శ్రీనివాస్, బండారి నర్సింగం, బండి స్వామి, మేకల రాజయ్య, గడ్డం క్రాంతి, చంద్రగిరి సంపత్, ఉప సర్పంచ్ లు లకావత్ సవేందర్, బొబ్బిలి రాజు గౌడ్, అక్కల రాము యాదవ్, తాళ్ల రవిందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా నాయకులు ఐత రాజిరెడ్డి, జంపయ్య, కొండూరి మమత, వొన్న తిరుపతి రావు, జక్కుల వెంకటస్వామి యాదవ్, చెంద్రయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -