నవతెలంగాణ – కాటారం
కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి పంతకాని తిర్మల సమ్మయ్య శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పీకర్‌గా నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను కాపాడారని, మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించిన అజాతశత్రువు, ప్రజానాయకుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ చీనాల బ్రహ్మారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రామగుండం శ్రీనివాస్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి, నాయకులు కుమార్ యాదవ్, భూపెల్లి రాజు, బొడ్డు శేఖర్, కుమ్మరి అశోక్, గజ్జల కిషోర్, డోంగిరి రవి, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



