నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులాగూడెం గ్రామపంచాయతీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కీర్తిశేషులు శ్రీపాద రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పాగే ఆమని సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ ఆయన ప్రజాసేవ, నిబద్ధత, నిష్పక్షపాత ధోరణి గురించి స్మరించుకున్నారు. స్పీకర్‌గా ఆయన రాష్ట్ర రాజకీయ చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించారని పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధికి, సామాజిక న్యాయానికి కృషి చేసిన మహనీయుల ఆలోచనలను యువత ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం స్కూల్ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం లో శంకరంపల్లి సర్పంచ్ సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు అజ్మీరా కిషన్ నాయక్,ఉప సర్పంచ్ పాలరపు వెంకటస్వామి,కిషన్ సెల్ జిల్లా అధ్యక్షులు వొన్న వంశవర్ధన్ రావు, జయశంకర్ భూపాలపల్లి కాంగ్రెస్ జిల్లా ఉప అధ్యక్షులు గద్దె సమ్మి రెడ్డి, తుటి నారాయణ, యూత్ అధ్యక్షులు గంధం రజినీకాంత్, మొగిలి రాజ్ కుమార్ శనిగరం ముత్తయ్య మార్కెట్ డైరెక్టర్ పిల్లమారి రమేష్, గుడిపాటి రమేష్ రెడ్డి, కార్యదర్శి , వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



