Friday, September 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత

- Advertisement -

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతోజలకళ
2,16,520 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలకళను సంతరించుకుంటు న్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు ఆదివారం ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దాంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 2,16,520 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 3.40 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్‌ ఫ్లో 3.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 30 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 30,624 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగుల వరకు నీరు ఉంది. ఇక ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి ఉండటంతో మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -