Sunday, July 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలునిండు కుండ‌ల శ్రీశైలం

నిండు కుండ‌ల శ్రీశైలం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయం నిండు కుండ‌ల‌ త‌ల‌పిస్తోంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 14 గేట్ల ద్వారా నీరు విడుదల కావడంతో కృష్ణానదిలో ఉరకలేసేలా ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు ఒక క్రస్ట్ గేటును 10 అడుగుల మేర పైకి ఎత్తి, దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 1.22 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1.49 లక్షల క్యూసెక్కులు కాగా, అవుట్‌ఫ్లో 1.22 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 883.30 అడుగులకు చేరుకుంది. అలాగే ప్రాజెక్టు నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలుగా ఉండగా, బుధవారం నాటికి 202.9673 టీఎంసీల వద్ద నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుండటంతో అధికారులు ఒక గేటు ద్వారా మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి కొనసాగుతోందని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -