- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. వరద తగ్గడంతో ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 65,985 క్యూసెక్కుల వరద వస్తుండగా.. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాలలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 68,753 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయ నీటి మట్టం 882.50 అడుగులు.. నీటి నిలువ 201.582 టీఎంసీలుగా నమోదైంది.
- Advertisement -