Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు మినిమం టైంస్కేల్‌ ఇవ్వాలి

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు మినిమం టైంస్కేల్‌ ఇవ్వాలి

- Advertisement -

విద్యాశాఖ సంచాలకులకు పీఆర్టీయూ తెలంగాణ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైంస్కేల్‌ (ఎంటీఎస్‌) ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ను సోమవారం హైదరాబాద్‌లో పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు జి హర్షవర్ధన్‌రెడ్డి, అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి బి రత్నాకర్‌రావు కలిసి వినతిపత్రం అందజేశారు. పీఏబీలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు ఎంటీఎస్‌ ఇచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపాలని కోరారు.

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు 2024లో రెగ్యులరైజ్‌ చేయాలంటూ చేసిన 28 రోజుల సమ్మె కాలపు వేతనాలను చెల్లించాలని తెలిపారు. ఎంటీఎస్‌ వచ్చే వరకు వంద శాతం వేతనాలను పెంచాలని పేర్కొన్నారు. పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లుగా పనిచేస్తున్న వారికి పది నెలలు మాత్రమే వేతనాలను చెల్లిస్తున్నారని తెలిపారు. వారికి 12 నెలల వేతనం ఇవ్వాలని కోరారు. కేజీబీవీల్లో రాత్రి విధులు చేసిన మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకే రిలీవ్‌ చేయాలని సూచించారు. కేజీబీవీల్లో కేర్‌టేకర్లను నియమించాలని తెలిపారు. కేజీబీవీ సీఆర్టీలకు పదో తరగతి మూల్యాంకనం పీజీసీఆర్టీలకు ఇంటర్‌ మూల్యాంకనం చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -