గత సంవత్సరం బకాయిలు విడుదల చేయాలి : టీఎస్ యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రేట్లను 50 శాతం పెంచాలనీ, గతేడాది మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ వెంకట్ సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు పి వి శ్రీహరి ని కలిసి వినతి పత్రం అందజేశారు. 2018 లో రాష్ట్ర ప్రభుత్వం స్పాట్ రేట్లు సవరించిందని తెలిపారు. ఎనిమిదేండ్లుగా అవే రేట్లు అమలుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం రేట్లు రెండు సార్లు పెంచారని గుర్తు చేశారు.
కనుక పదో తరగతి మూల్యాంకనం రేట్లను కూడా ఆమేరకు సవరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత సంవత్సరం మూల్యాంకనం విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు నేటి వరకు రెమ్యూనరేషన్ చెల్లించలేదని గుర్తు చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభం అవుతున్నందున అంతకు ముందే గత సంవత్సరం బకాయిలు చెల్లించాలనీ, లేదంటే స్పాట్ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో పివి శ్రీహరి సానుకూలంగా స్పందించారని తెలిపారు. గత సంవత్సరం బడ్జెట్ నాలుగు రోజుల క్రితమే విడుదలైందనీ, బిల్లులు చేసి ఆర్థిక శాఖకు పంపించామనీ, స్పాట్ రేట్ల పెంపు ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.
ఎస్సెస్సీ స్పాట్ రేట్లు 50శాతం పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



