Monday, September 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజావాణికి వచ్చిన వికలాంగున్ని బయటకు గెంటేసిన సిబ్బంది

ప్రజావాణికి వచ్చిన వికలాంగున్ని బయటకు గెంటేసిన సిబ్బంది

- Advertisement -

– జగిత్యాల కలెక్టరేట్‌లో ఘటన
నవతెలంగాణ- జగిత్యాల

జగిత్యాల కలెక్టరేట్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రజావాణిలో తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ వచ్చిన ఓ వికలాంగుడిని కలెక్టరేట్‌ సిబ్బంది అవమానించి బయటకు గెంటేశారు. మల్లాపూర్‌ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వికలాంగుడు మర్రిపల్లి రాజగంగారామ్‌ తన ఇంటి స్థలంలో అక్రమంగా గోడ నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. ఈ సమస్యపై గత వారం కూడా కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేయగా, కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించాడు. అయితే, అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంతో రాజగంగారామ్‌ సోమవారం మళ్లీ ప్రజావాణికి వచ్చాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన తన వీల్‌చైర్‌లో అదనపు కలెక్టర్‌ ముందు తన సమస్యను వివరిస్తుండగా కలెక్టరేట్‌ సిబ్బంది తాగి వచ్చాడని ఆరోపిస్తూ ఆయన్ను వీల్‌చైర్‌తో సహా బయటకు నెట్టేశారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రాజగంగారామ్‌కు న్యాయం చేయాలని వికలాంగుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -