Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 

వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 

- Advertisement -

– డిప్యూటీ డిఎంహెచ్ ఓ తార సింగ్ 
నవతెలంగాణ – బల్మూరు 

గ్రామాలలో ప్రస్తుతం వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ తారా సింగ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలతో తాగునీరు కలుషితమవుతుందని, వాటిని తాగిన ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని వారికి తగిన సూచనలు ఆరోగ్య సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.

ఇంటి పరిసరాలు వీధులు నిలువ ఉంటున్న నీటితో అపరిశుభ్రంగా మారుతున్న పరిస్థితి నెలకొన్నదని ఈ కారణంగా దోమల వ్యాప్తి పెరిగి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని అన్నారు. అందుకే వైద్య సిబ్బంది గ్రామ గ్రామం తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.  వైద్య సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని లేనిచో శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కల్పనా, ఫార్మసీ ఆఫీసర్ శ్రీనివాసులు,  సూపర్వైజర్ ఉమా,ఏ ఎన్ ఎం హెల్త్ అసిస్టెంట్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -