నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో స్టేజ్ నిర్మాణాల కార్యక్రమం బుధవారం నాడు నిర్వహించబడింది.
ఈ స్టేజి నిర్మాణ కార్యక్రమానికి ఖర్చు మొత్తాన్ని దాతగా జిల్లా పరిషత్ పాఠశాల చెందిన ఉపాధ్యాయురాలు మీరాబాయి ముందుండి కీలక పాత్ర పోషించి, స్టేజ్ నిర్మాణానికి విలువైన సహకారం అందించారు. గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిపై వారి అంకితభావం నిజంగా అభినందనీయం అని సర్పంచ్ పేర్కొన్నారు. తాను విద్య నేర్పుతున్న పాఠశాలని దాతగా మారి పాఠశాల అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆస్పత్వర్ అనిల్ కుమార్ గారు పాల్గొని తమ మద్దతు అందించారు. గ్రామ అభివృద్ధికి వారి కృషి కూడా ప్రశంసనీయం అని ఎంఈఓ తిరుపతయ్య తెలిపారు. అలాగే ఎంఈఓ తిరుపత్య , ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడురాజయ్య, ఐక్యథ యూత్ ప్రెసిడెంట్ రవి , గ్రామ యువకులు, ఆస్పత్వర్ పండారి రమేష్ మరియు టీచర్స్ స్టాఫ్ అందరూ పాల్గొని కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశి తదితరులు పాల్గొనడం జరిగిందని అన్నారు.



