Saturday, February 14, 2026
E-PAPER
Homeబీజినెస్స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కొత్త లోగో ఆవిష్కరణ

స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కొత్త లోగో ఆవిష్కరణ

- Advertisement -

జన్నారంలో రూ.240 కోట్లతో కొత్త యూనిట్‌ : కంపెనీ ఎండీ కందుల నాగేశ్వరరావు వెల్లడి
నవతెలంగాణ – హైదరాబాద్‌

ప్రముఖ గ్లాస్‌, ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల కంపెనీ స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ తన బ్రాండ్‌ పరిణామ క్రమంలో భాగంగా స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీగా పేరు మార్చుకోగా.. తాజాగా నూతన లోగోను ఆవిష్కరించింది. కంపెనీ విస్తృతమైన సేవల పరిధిని ప్రతిబింబించేలా ఈ మార్పు చేపట్టామని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కందుల నాగేశ్వరరావు వెల్ల డించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన కంపెనీ నూతన లోగోను విడుదల చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. మెదక్‌ సమీపంలోని జన్నారంలో నూతన ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను రూ.240 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. తొలి దశలో రూ.120 కోట్ల పెట్టుబడులను వ్యయం చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఇది అందుబాటులోకి రానుందని తెలిపారు. కంపెనీ పేరు, లోగోలో మార్పు వచ్చినప్పటికీ తమ మూల వ్యాపారమైన గ్లాస్‌ లైనింగ్‌ రంగం నుండి తప్పుకోవడం లేదని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో గ్లాస్‌ లైనింగ్‌ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేస్తూనే.. ఇతర ఇంజనీరింగ్‌, సమీకృత పరిష్కారాల విభాగాల్లో వృద్ధిని వేగవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -