నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, (బిట్స్) పిలాని మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. కోర్సులు, ఇంటర్న్‌షిప్ మార్గదర్శకాలు, ప్రాజెక్టు సహకారం, సమన్వయం మొదలైన అంశాలపై ప్రొఫెసర్ అలివేలు మంగ పారిమి వివరించారు. పీజీ, పీహెచ్‌డీ మార్గదర్శకాలు, వాటికి అవసరమైన కనీస అర్హతల గురించి చెప్పారు. వివిధ ప్రాజెక్టులు వాటి సహకారం గురించి శివాని యాదవ్, జి శిరీష, చేతన్‌కుమార్, అభిజిత్‌దాస్ వివరించారు. కొత్తగా వస్తున్న కంప్యూటర్ సైన్స్ విభాగాల ప్రాధాన్యత, వాటి ద్వారా రియల్ టైమ్ ప్రాజెక్టు పనులను పొందడం గురించి షేక్ అజీజ్ అలీ చెప్పారు. ప్రాజెక్టుల్లో విద్యార్థులు సక్రమంగా పాల్గొనాలని స్టాన్లీ కాలేజీ ప్రిన్సిపాల్ బిఎల్ రాజు అన్నారు. రియల్ టైమ్ డేటాపై ప్రాజెక్టు, ఇంటర్న్‌షిప్ పనుల ప్రాముఖ్యత గురించి జి రవి కిషోర్ వివరించారు. ఇవి విద్యార్థుల ఉపాధిలో రిక్రూటర్లకు అదనపు ప్రయోజనం కలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాన్లీ కాలేజీ సెక్రెటరీ, కరెస్పాండెంట్ కె కృష్ణారావు, యాజమాన్య సభ్యులు టి రాకేష్ రెడ్డి, ఆర్ ప్రదీప్ రెడ్డి, డీన్ అకడమిక్స్ ఏ వినయ బాబు, డైరెక్టర్ వి అనురాధ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బిట్స్ పిలానితో స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీ ఒప్పందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES