Sunday, May 18, 2025
Homeకరీంనగర్ఘనంగా స్టార్ హెల్త్ 19వ వార్షికోత్సవం..

ఘనంగా స్టార్ హెల్త్ 19వ వార్షికోత్సవం..

- Advertisement -

అనాథ వృద్ధాశ్రమంలో సరుకులు పంపిణీ..
నవతెలంగాణ- కరీంనగర్:
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్ లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధాశ్రమంలో నిత్యావసర వస్తువులు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని చీఫ్ సేల్స్ మేనేజర్ ఇజ్జగిరి పద్మలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ ఏరియా మేనేజర్ కుమార్ గోపు, బ్రాంచ్ మేనేజర్ కడార్ల శ్రీనివాస్, చీఫ్ సేల్స్ మేనేజర్ ఇజ్జగిరి పద్మలత శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ వేములవాడ అనిల్ కుమార్,  బీమా ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇజ్జగిరి పద్మలత మాట్లాడుతూ, స్టార్ హెల్త్ ఆరోగ్య బీమా పాలసీదారులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు 19వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆరోగ్య బీమా తీసుకొని ఆర్థిక ధీమాతో ఉండాలని కోరారు.
కుమార్ గోపు మాట్లాడుతూ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 2006 నుండి 2025 వరకు ₹22 కోట్లతో ప్రారంభమై, ₹17 వేల కోట్లకు ఎదిగిందని తెలిపారు. ఒక కోటికి పైగా క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేసిన ఏకైక సంస్థ ఇదేనని, భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. బ్రాంచ్ మేనేజర్ కడార్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, మానవసేవయే మాధవ సేవ అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందం కలిగిందని చెప్పారు. ఇజ్జగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత సంవత్సరం స్టార్ హెల్త్ కంపెనీ 14 లక్షల క్లెయిమ్స్ మరియు ₹7600 కోట్లు పాలసీదారులకు క్లెయిమ్ ల రూపంలో చెల్లించిందని వివరించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వచ్చే పుణ్యఫలం కంపెనీకి, కంపెనీలో పనిచేసే వారందరికీ మేలు చేస్తుందని, భారతదేశంలో ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించి ఆర్థిక ధీమాతో ఆనందంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -