Tuesday, May 20, 2025
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో స్టార్ లింక్ సేవ‌లు ప్రారంభం

బంగ్లాదేశ్‌లో స్టార్ లింక్ సేవ‌లు ప్రారంభం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: స్టార్ లింక్ సేవ‌లు బంగ్లాదేశ్ లో మొద‌లైయ్యాయి. ఈమేర‌కు ఆదేశ ముఖ్య ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడు ఫైజ్ అతాయెబ్ అహ్మద్ ఫేస్ బుక్ వేదిక‌గా ప్రక‌టించారు. స్టార్ లింక్ సేవ‌లు మా దేశంలో ప్రారంభ‌మైయ్యాయి. ఈ సేవ‌ల‌పై ఎక్స్ అధినేత ఎలాన్ మ‌స్క్ తో ఫోన్‌లో సంప్ర‌దింపులు జ‌రిగాయ‌న్నారు. గృహా నివాసాల‌కు నెల‌కు 6000(USD 47) టంకాలు , ఇత‌ర సేవ‌ల‌కు అయితే 4200(USD 33) టంకాలు చెల్లించాల‌ని పేర్కొన్నారు. ఒకేసారి ఈ స్టార్ లింక్ సేవ‌లు పొందాలంటే మొత్తం 47,000 టంకాలు (USD 372) చెల్లించి ఈ సేవ‌ల ప‌రిక‌రాలు పొంద‌వ‌చ్చ అని ఆయ‌న తెలియ‌జేశారు. వినియోగ‌దారులు సెక‌న్‌కు 300Mbps స్పీడ్ తో డేటా పొంద‌వ‌చ్చున‌ని ఆయ‌న తెలిపారు. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం ఏప్రిల్ 9న ట్రయల్ రన్ తర్వాత స్టార్‌లింక్ తన సేవలను అందించడానికి అనుమతించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడం త‌మ లక్ష్యమ‌ని ఆ దేశ‌ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -