Tuesday, July 1, 2025
E-PAPER
Homeబీజినెస్స్టార్‌లింక్‌తో తడిసి మోపెడే..!

స్టార్‌లింక్‌తో తడిసి మోపెడే..!

- Advertisement -

– ఇన్‌స్టాలేషన్‌కు రూ.33వేలు
న్యూఢిల్లీ :
అమెరికన్‌ కార్పొరేట్‌ దిగ్గజం ఎలన్‌ మస్క్‌కు చెందిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలకు భారత్‌లో అనుమతి ఇచ్చిన వేళ ఆ సంస్థ ఛార్జీల పట్ల పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే స్టార్‌లింక్‌ చార్జీలు తడిసిమోపెడు కానున్నాయని తెలుస్తోంది. ఇటీవలే ఆ సంస్థ బంగ్లాదేశ్‌లోనూ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇందుకోసం డేటా రిసీవర్‌కు సంబంధించిన హార్డ్‌వేర్‌ ధరను రూ.33,000 నిర్ణయించింది. నెలవారీ ప్లాన్‌ ప్రారంభ ధరల రూ.3,000గా ఉంది. అదే ధరలను భారత్‌లోనూ వసూలు చేయవచ్చని జాతీయ మీడియాల్లో రిపోర్టులు వస్తోన్నాయి. ప్రస్తుతం దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో, భారతీ ఎయిర్‌టెల్‌ అందిస్తున్న బ్రాడ్‌బాండ్‌ ధరలతో పోల్చితే స్టార్‌ లింక్‌ ధర చాలా భారంగా ఉండనుంది. స్పెక్ట్రం కేటాయింపు, ఇతర అనుమతులు పూర్తి అయి శాటిలైట్‌ సేవలు అందుబాటులోకి రావడానికి మరో ఏడాది పట్టొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -