నవతెలంగాణ- ఓయూ : ప్రభుత్వ ఆర్డినెన్స్ తో 42 శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో ఇవ్వడం సులభమైనది కాదు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్ పాస్ చేస్తూ భారత ప్రెసిడెంట్ కు పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదనీ సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి అన్నాడు. సోమవారం తార్నాక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. బిజెపిలో ఉలుకు పలుకు లేకుండా పోయింది. రాష్ట్రంలోనీ ప్రతిపక్ష పార్టీలైన బిఆర్ఎస్, బిజెపి లు బీసీ రిజర్వేషన్లను పట్టించుకోలేదు. ఇది పార్టీల మధ్య సమస్య కానే కాదు. బీసీ రిజర్వేషన్ల పెంపు అనేది రాష్ట్రానికి సంబంధించినదని, 60% గా ఉన్న బీసీలు గత ఏడు దశాబ్దాలుగా అధికారం నుండి వెలివేయబడుతున్నారు. ఇది తీవ్రమైన రాజకీయ దుశ్చర్యగా కొనసాగుతుందన్నారు.
రాజ్యాంగం ఎలాంటి సీలింగును విధించనప్పటికీ కోర్టు తీర్పులతో 50% సీలింగ్ ప్రక్రియ మొదలైoది. 42% బీసీ రిజర్వేషన్లు పార్లమెంటు తీర్మానంతో 9 వ షెడ్యూల్ లో చేర్చితేనే సాధ్యమవుతుందన్నారు. ఇది ఏ ఒక్క పార్టీ పరిధిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అనుకున్న మేరకు ప్రయత్నించలేదు. రాష్ట్ర ప్రభుత్వ విముఖత మొదటి నుండి కనిపించింది. పైన కాంగ్రెస్ నాయకత్వం, క్రింద పౌర సమాజం ఒత్తిడి తో ప్రభుత్వo అయిష్టంగానే అడుగులు వేసింది. సామాజిక న్యాయం కోర్ ఎజెండాగా చెప్పుకునే కాంగ్రెస్ ఆచరణలో లోప భూయిష్టంగా వ్యవహరిస్తూ వచ్చింది. అసెంబ్లీలో ఏకగ్రీవంగా బీసీల పట్ల స్పందించినప్పటికీ పార్టీల ఐక్య కార్యాచరణ వైపు కాంగ్రెస్ నడిపించలేకపోయింది. పలు సమస్యల పట్ల ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేస్తూ వస్తున్నది. కానీ రిజర్వేషన్ల సీలింగ్ను ఎత్తివేయడానికి బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. కనీసం ప్రధాన మంత్రికి ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు. బీసీ రిజర్వేషన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమని కనబరుస్తూ వస్తున్నది.
ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ల పట్ల ఐక్య కార్యాచరణ చేపట్టాలనీ ప్రొఫెసర్ సింహాద్రి డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావి వర్గాలను కూడ తీసుకొని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. ఒకవేళ కేంద్రం స్పందించనీచొ ప్రజా క్షేత్రంలో బిజెపిని ఎండ కట్టాలి. బీసీలను బలి చేసే బిజెపి రాజకీయాలకు తెలంగాణ బుద్ధి చెప్పాలని సూచించారు. 42% బీసీ రిజర్వేషన్ల చర్చ గ్రామ గ్రామాన జరుగుతున్నది. ఏ చిన్న ప్రయత్న లోపం జరిగిన కాంగ్రెస్ బిజెపి రాజకీయాలను తెలంగాణ బీసీలు సహించరు. బీసీలకు ఏ రూపంలో అవమానాలు జరిగిన వారి నిరసనను రాష్ట్రంలోని ఎదిగిన వర్గాల పార్టీలు చవి చూడక తప్పదు. కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ల పట్ల వారి సిన్సియారిటీని ఆచరణలో చూపించాలి. 42% రిజర్వేషన్ల కోసం బీసీ సమాజం తీవ్రంగా ఎదురుచూస్తున్నది. బీసీలను బలి చేసే బిజెపిపై ఒత్తిడి పెంచాలి. బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని, రాష్ట్రం అభివృద్ధి వైపు సాగుతుంది. ఈ విలేకరుల సమావేశంలో సమాజ్వాది పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ నిమ్మ తోట వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మణ్ కోకటి పాల్గొన్నారు.