Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ రిజర్వేషన్ కోసం 18 గంటలు రాష్ట్ర అసెంబ్లీ 

బీసీ రిజర్వేషన్ కోసం 18 గంటలు రాష్ట్ర అసెంబ్లీ 

- Advertisement -

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 
నవతెలంగాణ -ఆలేరు 

రాష్ట్ర చరిత్రలోనే ఒక బిల్లు ఆమోదం కోసం 18 గంటలు సమావేశమైనది గతంలో ఎన్నడూ లేదని అది బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసమే జరిగిందని ప్రభుత్వ బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఆలేరులో పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ .. రేవంత్ రెడ్డి ఓసి అయిన బీసీల కోసం వారికి న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం పరితపిస్తున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి హోదాలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కావాలనే పట్టుదలతో ఆయనలో ఉందన్నారు.

గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం లో కెసిఆర్  బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయంగా అక్రమంగా రిజర్వేషన్ మించకుండా ఒకే స్లాబ్ విధానంతో చట్టం తీసుకొస్తే దాన్ని రేవంత్ రెడ్డి కాలరాశి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం జీవో నెంబర్ 68 69 ద్వారా నాలుగు ఐదు రోజుల క్రితమే తీసుకొచ్చారు. దీనికి అన్ని పార్టీలు తప్పని పరిస్థితిలో ఆమోదం తెలిపాయి ఎందుకంటే గత్యంతరం లేదు కాంగ్రెస్ క్రెడిట్ ఎక్కడ వస్తుందో అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి బిజెపి బిఆర్ఎస్ పార్టీలకు ఆమోదం తెలిపారు.ప్రభుత్వ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -