Saturday, July 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలు28న రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ

28న రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. శుక్రవారం జరగాల్సిన ఈ సమావేశం ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ మేరకు శుక్రవారం సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి కూడా వెళ్లారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా అక్కడే ఉండిపోయారు. దీంతో సీఎం, ఐదుగురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో క్యాబినెట్‌ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేసినట్టు ప్రకటించింది. వీరంతా శుక్రవారం సాయంత్రానికి హైదరాబాద్‌కు తిరిగొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -