Wednesday, February 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం23న రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ

23న రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ

- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఆస్తులు, ఉద్యోగుల సర్దుబాటే ప్రధాన ఎజెండా
బడ్జెట్‌, వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీపై చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన దరిమిలా గ్రేటర్‌లో ఆస్తుల విభజన, ఉద్యోగుల సర్దుబాటే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 23న భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లోని సచివాలయంలో క్యాబినెట్‌ సమావేశం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలుగా విభజించిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థకు ఇప్పుడున్న ఆస్తులు, అప్పులను మూడు కార్పొరేషన్లకు పంచాల్సి ఉంది. వాటి అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతమున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని సర్దుబాటు చేయాల్సి ఉంది. ఈ అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌, ఆ మేరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. పోలీస్‌, వైద్యం, ప్రజారోగ్యం తదితర కీలక శాఖల్లోని ఖాళీ పోస్టుల భర్తీపై కూడా మంత్రి వర్గం సమాలోచనలు చేయనుంది. గత క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, పురోగతిపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -