Thursday, July 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురేపు రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ

రేపు రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ

- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై ప్రధాన చర్చ
సంక్షేమ, అభివృద్ధి పథకాల నిధుల సమీకరణకు కసరత్తు
వానాకాలం పంటసాగు, ఎరువులపై సమాలోచనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర మంత్రి వర్గం శుక్రవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన. హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో ప్రతి 15 రోజులకొకసారి మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం క్యాబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై క్యాబినెట్‌ భేటీలో ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. వానాకాలం పంటసాగు, ఎరువుల కొరతపై సమావేశంలో చర్చించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై కొనసాగుతోన్న విచారణలపై ఈ సమావేశం చర్చించనుంది. సంక్షేమ, అభివృద్ధి పథకాల నిధుల సమీకరణపె క్యాబినెట్‌ ప్రత్యేక దృష్టి సారించనుంది. వివిధ శాఖల అధికారులు మంత్రి వర్గం పరిశీలన కోసం ఆమోదించబడిన అజెండా అంశాలను గురువారం సాయంత్రానికి అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు బుధవారం సర్క్యులర్‌ జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -