బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం
ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పునరుద్ధరణపై సమాలోచనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర మంత్రి వర్గం గురువారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం న్యాయ నిపుణుల కమిటీ వేసింది. న్యాయ నిపుణుల నివేదిక ప్రభుత్వానికి చేరింది. దీనిపై చర్చించి బీసీ రిజర్వేషన్లపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
అలాగే ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పునరుద్ధరణ, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల నిర్మాణం సహా పలు ప్రాజెక్టులపై మంత్వ్రివర్గం చర్చించనుంది. అలాగే ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశకు రామిరెడ్డి దామోదర్‌రెడ్డి పేరుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైతు భరోసాపై క్యాబినెట్ చర్చించనుంది. వీటితో పాటు మరిన్ని అంశాలు మంత్రి వర్గ సమావేశంలో చర్చకు రానున్నట్టు సమాచారం.
నేడు రాష్ట్ర క్యాబినెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES