Monday, February 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజన్న ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి

రాజన్న ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి

- Advertisement -

– కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీకి మెజారిటీ లేదు : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
– ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి, ప్రభుత్వ విప్‌
నవతెలంగాణ – వేములవాడ

వేములవాడ రాష్ట్రానికి ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రమని, రాజన్న ఆశీస్సులతోనే రాష్ట్రాభివృద్ధికి అవుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆదివారం మహా శివరాత్రిని పురస్కరించుకుని దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి మంత్రి స్వామివారికి సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించగా, నేతలు స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గతంలో ఆలయ అభివృద్ధి కోసం చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ఆలయ విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. నిజామాబాద్‌ మాదిరిగానే కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోనూ బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేదని అన్నారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 సీట్లలో 28 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుందని, అక్కడ మెజారిటీ లేకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పినవారు ఇక్కడ కూడా అదే ప్రమాణం పాటించాలన్నారు. కరీంనగర్‌లో మొత్తం 69 మంది సభ్యుల్లో బీజేపీకి 30 మంది మాత్రమే ఉన్నారన్నారు. మేయర్‌ పదవిపై ముందుగానే ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. గెలిచిన కార్పొరేటర్లు ప్రజాస్వామ్య విధానంలోనే మేయర్‌ను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -