నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తనయుడు రాష్ట్ర యువజన నాయకుడు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ కు బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. డిసిసి అధ్యక్షులు, మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కైలాస్ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కామారెడ్డి ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ నాయకులు తమ అభిమాన నాయకుని జన్మదినంలో తమ ప్రియతమ నాయకుని పై ఉన్న ప్రేమ అభిమానాన్ని ఫ్లెక్సీలు కట్టి బాణాసంచాలు పేల్చి కేకులు కట్ చేసుకుని ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు