నవతెలంగాణ- దర్పల్లి
మండలంలోని రామడుగు గ్రామానికి చెందిన ఆరుట్ల ఆరాధ్యకు రాష్ట్ర స్థాయిలో విశ్వం ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో నీవహించిన అబాకాస్ పోటిల్లో ప్రథమ బహుమతి సాధించింది. ఈసందర్బంగా రామడుగు గ్రామములోని శ్రీ విజ్ఞాన్ హైస్కూల్ ప్రిన్సిపాల్లో కల్లెడ రాజు తెలిపారు. అదేగ్రమానికిచెందిన ఆరుట్ల ఆరాధ్య అనే విద్యార్థి 5వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. మొదటినుండి ఆటల్లో, చదువులో హుషారుగా ఉండే ఈ విద్యార్థి ఈ పోటిల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో ప్రశాంసా పత్రము సాధించడం గొప్పవిషయమని అన్నారు. కాగా రానున్న జాతీయ స్థాయి అబాకస్ పోటిల్లో పాల్గొననుందని తెలిపారు.ఈసందర్బంగా విద్యార్థినికి అయన అభినందించారు. కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.
ఆరుట్ల ఆరాధ్యకు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



