Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి  ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ విద్యార్థులకు వ్యాస రచన పోటీలు 

రాష్ట్రస్థాయి  ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ విద్యార్థులకు వ్యాస రచన పోటీలు 

- Advertisement -

జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు 
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి, విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు సంబంందించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు  ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈనెల 21 న వారోత్సవాలు నిర్వహించబడుతాయని ఈ పోటీలకు విద్యార్థులతో పాటు, యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఉత్సహంగ పాల్గొనాలని అన్నారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవల కాలంలో తీసిన (3) ఫోటోలు మరియు తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 25వ తేదీలోపు జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను పోలీస్  పిఆర్వో  కు అందజేయాలన్నారు.

ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు..

– మూడనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు
– అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన
– ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ
– ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలు
– సైబర్ నేరాలు ఈవ్టీజింగ్, ర్యాగింగ్
– మత్తు పదార్థాల సేవనం వాటి అనర్దాలు 

పెంపొందించే అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2024 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు తీసిన మూడు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్ మాత్రమే పంపించాల్సి వుంటుంది. ఈ నెల 25 వ తారీఖు లోపు జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలోని PRO సెక్షన్ నందు ఇవ్వాల్సి వుంటుందని అన్నారు.

విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  విద్యార్థులకు  ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ (Essay Writing Competition) నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చుఅని  అన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని , ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది అంతే కాకుండా జిల్లా  స్థాయిలో  1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడతాయి.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని ఎస్పి గారు సూచించారు. వ్యాసరచన అంశం (డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్‌ నుండి ఎలా దూరంగా ఉండగలరు)

పోటీలో పాల్గొనే విధానం

1. కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనండి:
https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
2. మీ పేరు, విద్యార్హత మరియు ఇతర వివరాలు నమోదు చేయండి.
3. వ్యాసాన్ని పేపర్‌పై రాసి, దానిని చిత్రం (image) లేదా PDF ఫార్మాట్‌లో (500 పదాలు మించకూడదు) అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి. మరిన్ని వివరాల కోసం 8712661828 నెంబర్ ద్వారా పీఆర్ఓ ను సంప్రదించాలన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమించి తమ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విధ్యార్థులతో పాటు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -