నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో రెండు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరికరాలను గురువారం నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ప్రారంభించారు. పరికరాల మొత్తం విలువ సుమారు రూ.2 కోట్లు. కర్ల్ స్టోర్జ్ 4కె టీఎల్-400 రుబీనా లాప్రోస్కోపిక్ విత్ ఐసీజీ సిస్టమ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీల సమయంలో హై-డెఫినిషన్ విజువలైజేషన్, నియర్-ఇన్‌ఫ్రారెడ్ ఫ్లోరసెన్స్ ఇమేజింగ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. దీని ద్వారా శస్త్రచికిత్సలు మరింత ఖచ్చితంగా, సురక్షితంగా చేయగలుగుతారు.
ఒలంపస్ సీవీ-170 ఎండోస్కోపి, కొలొనొస్కోపీ సిస్టమ్ అత్యుత్తమ చిత్ర నాణ్యతను అందిస్తూ, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ వ్యాధుల తీవ్రతను ముందుగానే గుర్తించడం, చికిత్సను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పరికరం శస్త్ర చికిత్స సమయంలో, ఆ తర్వాత దశల్లో కూడా వైద్యులకు మెరుగైన క్లినికల్ అవగాహనను అందిస్తుంది. ఈ సందర్భంగా డాక్టర్ బీరప్ప మాట్లాడుతూ ఆధునిక పరికరాల ప్రవేశంతో విభాగంలోని శస్త్రచికిత్సలు, ఎండోస్కోపిక్ విధానాల్లో అధునాతన సాంకేతికతను వినియోగించే అవకాశం కలిగిందనీ, రోగాల నిర్ధారణ, చికిత్సలో ఖచ్చితత్వం, భద్రత, సమర్థత మరింతగా పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రోలాజీ విభాగం వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నిమ్స్‌లో అత్యాధునిక వైద్య పరికరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



