Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యం 

రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యం 

- Advertisement -

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి 
రూ.30 కోట్లతో 100 పడకల ఆస్పత్రి 
ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం 
ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం 
ఇబ్రహీంపట్నం 100 పడకల ప్రభుత్వాసుపత్రికి శంకుస్థాపన 
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం

రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి అత్యధిక వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాణాలోకా అబద్దంగా ముందుకు సాగుతున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నంలో రూ.30 కోట్ల వ్యాయామంతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి మంగళవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత రూ .30 కోట్లతో మొదటి దశ నిర్మాణం పూర్తి చేయనున్నామని తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యాన్ని అందజేస్తామని ఆ లక్ష్యంతో ప్రభుత్వం వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో ఇప్పటికే చర్చించడం జరిగిందని,  మరో రూ .50 కోట్ల వరకు నిధులు తీసుకువచ్చి రెండో బ్లాక్ నిర్మాణానికి కూడా కృషి చేస్తామని తెలిపారు.

  ఈ ఆస్పత్రి నిర్మాణంతో ఇబ్రహీంపట్నం రూపు రేఖలు మారనున్నాయని తెలిపారు. గత 40 సంవత్సరాల క్రితం పురాతన ఆసుపత్రి భవనంలో ప్రజలకు కనీస వసతులు కరువై పశువుల వైద్యశాల కంటే హీనంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లు ఉంటే మందులు ఉండవని.. మందులు ఉంటే డాక్టర్లు ఉండే పరిస్థితి గతంలో ఉండేది లేదని ఆందోళన వెలిబుచ్చారు. గతంలో వైద్యం వికటించి అనేక మంది మహిళలు మృత్యువాత పడ్డ సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న వారిని నాణ్యమైన వైద్యం అందించేందుకు హైదరాబాదు నగరాల్లో పలు హాస్పిటల్ చేర్పించామని గుర్తు చేశారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదట ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి రూపురేఖలు మార్చాలని నిర్ణయించుకున్నామన్నారు.

ఆ దిశగానే నేడు మొదటి అడుగు పడిందని వివరించారు. ఆరు నెలల్లో నిర్మాణం  పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.  వంద పడకల ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తామని వివరించారు. అంతే కాకుండా ఇబ్రహీంపట్నంలో సెంట్రల్ లైటింగ్ విధానాన్ని సైతం మారుస్తామన్నారు. మెరుగుపరుస్తావని గుర్తు చేశారు. ప్రజలు ఈ ఆసుపత్రిని సద్వినియం చేసుకునే విధంగా కృషి చేస్తామని వివరించారు. చనిపోయిన శవాలకు కూడా పోస్టుమార్టం చేయించలేని దుస్థితి కనిపించని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి సమస్యలను తక్షణ పరిష్కరించి ప్రజలకు మెరుగైన అత్యధిక వైద్యాన్ని అందజేస్తామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి భూపతి గల్ల మహిపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లిక, మాజీ కౌన్సిలర్ భాను బాబు, సొసైటీ చైర్మన్ పాండురంగారెడ్డి తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -