– ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
– కామారెడ్డిలో ఇండోర్ స్టేడియానికి భూమిపూజ
నవతెలంగాణ-కామారెడ్డి
యువతకు అత్యాధునిక క్రీడా సదుపాయాలు కల్పించనున్నట్టు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంగణంలో రూ.8కోట్లతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు టీయూఎఫ్‌ఐడీసీ సహాయంతో అమలవుతూ, ఆధు నిక క్రీడా సదుపాయాలతో యువతకు ఉపయోగపడే విధంగా రూపొందించబ డు తుందని తెలిపారు. స్టేడియంలో బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ షూటింగ్ రేంజ్, టేబుల్ టెన్నిస్ హాల్, యోగా హాల్, జిమ్నాసియం వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇండోర్ స్టేడియం నిర్మాణం ద్వారా ప్రాంతీయ యువతకు ఉత్తమ క్రీడా వేదిక అందుబాటులోకి వస్తుందని, క్రీడాభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కామారెడ్డి ఆర్డీవో గిరి, కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మెన్ లక్ష్మీ రాజాగౌడ్, 15వ వార్డ్ కౌన్సిలర్ వనిత రామ్మోహన్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజ్ పాల్గొన్నారు.
యువతకు అత్యాధునిక క్రీడా సదుపాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



