Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని సందర్శించిన రాష్ట్ర అధికారులు 

ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని సందర్శించిన రాష్ట్ర అధికారులు 

- Advertisement -

–  విద్యార్థుల సేవా భావానికి ప్రశంసలు
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలోని సారంపల్లి గ్రామ శివారులో గల తెలంగాణ గిరిజన సంక్షేమ  డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని బుధవారం రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ డీడీఓ  నరసింహ గౌడ్   తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ అధికారి అపర్ణ  సందర్శించారు. ఈ సందర్భంగా  శిబిరంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించి, విద్యార్థుల సేవా భావాన్ని అభినందించారు. సమాజ సేవలో విద్యార్థులు చురుకుగా పాల్గొంటూ మంచి పనులు చేస్తున్నారని ప్రశంసించారు.  భవిష్యత్తులో  ఇలాంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టి. హరీష్, అధ్యాపకులు పి. జ్యోతి, ఎం. అజయ్, సి.హెచ్. ఆంజనేయులు, చిన్న లక్ష్మణ్, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -