యాటకర్ల దేవేష్ జక్రాన్ పల్లి మండల ముదిరాజ్ అధ్యక్షులు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాంపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ మండల అధ్యక్షులు యాటకర్ల దేవేశ్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు యాటకర్ల దేవేశ్ మాట్లాడుతూ ముదిరాజులకు అన్ని రాజకీయ పార్టీలు మొండి చేయి చూపించాయని రానున్న ఎలక్షన్లలో ముదిరాజుల అందర్నీ పార్టీలకతీతంగా గెలిపించుకుంటామని ముదిరాజులందరూ రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తున్నారని ముదిరాజులల్లో చైతన్యం వచ్చి మేమెంతో మాకు అంత నినాదంతో ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. ముదిరాజులు అన్ని కోణాల్లో అ న్యాయానికి గురవుతున్నారని. ముదిరాజులు అడిగే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదుగుతారని. జక్రంపల్లి గడ్డపై ముదిరాజుల జెండా ఎగరవేయడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువసేన రాష్ట్ర కార్యదర్శి కొప్పు రాజేందర్, ఈర్ల భూమేష్, సోప్పరి వినోద్, సిహెచ్ గోపి, పిట్ల కిషన్, పెద్దమ్మల గంగాధర్ శీలం మహేందర్,బొంగు సదానంద్, రొయ్యల నరేష్, బోండ్ల అరుణ్, కొప్పు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాధికారమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES