Friday, October 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'హ్యామ్‌'తో రాష్ట్ర రోడ్లకు మహర్దశ

‘హ్యామ్‌’తో రాష్ట్ర రోడ్లకు మహర్దశ

- Advertisement -

మూడేండ్లలో అద్దంలా మారుస్తాం
దేశానికే రోల్‌ మోడల్‌గా తెలంగాణ : ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
హ్యామ్‌ విధానంతో రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ పట్టనుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వచ్చే మూడేండ్లల్లో ఆర్‌అండ్‌బీ రోడ్లను అద్దంలా తయారుచేస్తామని ప్రకటించారు. దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ నిలుస్తుందన్నారు. రోడ్ల అభివద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం డా. బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో హ్యామ్‌ రోడ్ల నిర్మాణం పై ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ వికాస్‌రాజ్‌, ఫైనాన్స్‌ సెక్రెటరీ హరిత, ఆర్‌ అండ్‌ బీ అధికారులు జయభారతీ, బీవీ రావు, పలువురు ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు. హ్యామ్‌ రోడ్ల ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌రాజ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ హ్యామ్‌ ద్వారా వచ్చే మూడేండ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌ అండ్‌ బీ రోడ్లు అద్దంలా చేయనున్నామని తెలిపారు.

దేశానికే రోల్‌ మోడల్‌ గా నిలపాలనే లక్ష్యంతో ఆర్‌ అండ్‌ బీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని అన్నారు. రోడ్డు ప్రమాదాలు లేకుండా నిర్మాణంపై ప్రధాన దృష్టి సారించామని చెప్పారు. దశలవారీగా హ్యామ్‌ రోడ్లు చేపట్టనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. మొదటిదశలో సింహ భాగం హ్యామ్‌ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అందులో సింగిల్‌ , డబుల్‌ వరుసలు, నాలుగు వరుసల వారిగా రోడ్ల బలోపేతం చేయనున్నామన్నారు. దీంతో పాటు రోడ్ల వెడెల్పు చేయనున్నట్టు తెలిపారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసలు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు వరుసల రోడ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ఇందులో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నామన్న మంత్రి, ఒక అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఇంకో అసెంబ్లీ నియోజకవర్గానికి కనెక్టివిటీ కారిడార్లు గా హ్యామ్‌ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి ఫేజ్‌కు ఒకటి, రెండు నెలల్లో టెండర్లు పిలవనున్నట్టు మంత్రి వెల్లడించారు.

ట్రాఫిక్‌ సర్వేను దృష్టిలో పెట్టుకొని హ్యామ్‌ రోడ్లు
రాష్ట్రంలో దశలవారీగా హ్యామ్‌ రోడ్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హ్యామ్‌ రోడ్ల నిర్మాణక్రమంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని చెప్పారు. రోడ్ల నిర్మాణ క్రమంలో ట్రాఫిక్‌ సర్వేను గమనంలో పెట్టుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్‌ అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు మంత్రి తన ఛాంబర్‌లో ఆర్‌ అండ్‌ బీ ఉన్నతాధికారులతో శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల కారణగా దెబ్బతిన్న రోడ్ల వివరాలపై ఆరా తీశారు. పూర్తి వివరాలు త్వరలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మంచి రోడ్లు రాష్ట్ర అభివద్ధికి సోపానమని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్‌, ఆర్‌ అండ్‌ బీ ఈఎన్సీలు మోహన్‌నాయక్‌, జయభారతీ సీఈలు బీవీ రావు, కిషన్‌ రావు పలువురు ఎస్‌.ఈ లు, ఈ.ఈ లు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -