– రిజర్వేషన్, ఖాళీలపై సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ వెంకటయ్య సందర్శించారు. ఆస్పత్రిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్ అమలు, బ్యాక్‌లాగ్ ఖాళీలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు, ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసిన విధానాన్ని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప క్లుప్తంగా వివరించారు. ఈ వివరాలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంకా పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని సూచించారు. డైరెక్టర్ తీసుకుంటున్న చర్యలను చైర్మెన్ వెంకటయ్య అభినందించారు. ఈ సమీక్ష సమావేశంలో కమిషన్ సభ్యులు చరణ్ రాజ్, కుశ్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీ నారాయణ, జిల్లా శంకర్, రేణుకుంట్ల ప్రవీణ్, నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, డీన్ ప్రొఫెసర్ లిజా రాజశేఖర్, అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్, ఆర్‌ఎంఓలు, ఎస్సీ-ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు కేజియా, జనరల్ సెక్రెటరీ సేవాలాల్, ట్రెజరర్ బిడుగు శేఖర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ నిర్మల, రమణమ్మ, అసోసియేషన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘నిమ్స్’ను సందర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



