Magazines

ఎమ్మెల్సీ వెంకట్ కారుకు ప్రమాదం..!!

11 నిమిషాల క్రితం

MLC Venkat's car
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

బల్మూరి వెంకట్ దంపతులకు స్వల్ప గాయాలు

కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం ఢీ

నవతెలంగాణ-కొత్తూరు

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ నాగార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారును కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్గా చౌరస్తా వద్ద కోళ్ల లోడుతో వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు భార్య, సోదరుడు, డ్రైవర్‌ ‌గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత బల్మూరి వెంకట్ దంపతులు మరో కారులో హైదరాబాద్‌కు చేరుకున్నారు. వెంకట్‌ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్