Magazines

‘కుటుంబ బీమా’ అమలుకు పకడ్బందీ చర్యలు

14 నిమిషాల క్రితం

Robust measures for the implementation of ‘family insurance’
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపై బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్ర‌ణాళిక శాఖ కార్య‌ద‌ర్శి గౌర‌వ్ ఉప్ప‌ల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, పౌర సరఫరాల కమిషనర్ నాగిరెడ్డి, కార్మిక శాఖ కార్యదర్శి హరిచందన, ఐ.టి శాఖ ప్రత్యేక కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీతో పాటు అన్ని మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వివిధ వర్గాలకు అమలులో ఉన్న వివిధ బీమా పథకాలను ఈ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం గొడుగు కిందకు వస్తాయని స్పష్టం చేశారు. వివిధ శాఖల ద్వారా ప్రస్తుతం ఉన్న నేతన్న, గౌడ, కార్మిక, మత్సకారులకు అమలులో ఉన్న రెండు లక్షల రూపాయల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఐదు లక్షల రూపాయలకు పెరుగుతాయని వివరించారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అర్హులైన ప్రతి కుటుంబంలోని సభ్యులందరూ ఈ పథకంలో నమోదు చేసుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు అన్ని మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. పథకం మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా పాటిస్తూ, నమోదు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. దాదాపు నెలరోజుల పాటు కొనసాగే ఈ నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఈ బీమా నమోదుకు ప్రత్యేక యాప్ కు కూడా రూపొందిస్తున్నామని, ఆన్-లైన్ లోనూ నమోదుకు దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్