Magazines

బొలెరో క్యాంపర్ ఢీకొట్టి 
ఆర్టిజన్ కార్మికుని మృతి

34 నిమిషాల క్రితం

camper
avatar
balaji

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

చెల్పూర్ కేటీపీపీలో విషాదం

నవతెలంగాణ-గణపురం

జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ (కేటీపీపీ)లో బుధవారం బొలెరో క్యాంపర్ ఢీకొట్టి ఆర్టిజన్ కార్మికుడు మృతి చెందాడు. ఎస్‌ఐ బి. అశోక్‌ ‌తెలిపిన వివరాల ప్రకారం.. చెల్పూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీనివాసరావు(58) కేటీపీపీలో ఆర్టిజన్ గ్రేడ్-4 ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. రోజువారీ విధుల్లో భాగంగా ఇంటి నుండి ప్లాంట్‌కు వెళ్లాడు. శ్రీనివాసరావు కేటీపీపీ ప్లాంట్ మిల్స్ ఏరియా(స్టేజ్ టు) వద్ద విధి నిర్వహణలో ఉండగా గాదె శంకరయ్య అనే డ్రైవర్ తాను నడుపుతున్న బొలెరో క్యాంపర్ వాహనాన్ని అతివేగంగా, నిర్లక్ష్యంగా వెనుకకు రివర్స్ తీశాడు. వాహనం వెనుక ఉన్న శ్రీనివాసరావును బలంగా ఢీకొట్టి, ఆయనపై నుండి వెళ్లడంతో తలకు, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న తోటి ఉద్యోగులు, భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి ఆస్పత్రికి తరలించించారు. మృతుని భార్య లింగంపల్లి భాగ్యమ్మ ఫిర్యాదుతో డ్రైవర్‌ గాదె శంకరయ్యపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్