నవతెలంగాణ - హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు మరో మూడు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు. రానున్న మూడు రోజులు రాత్రి వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. నవంబర్ 19 తర్వాత తుఫాన్ ప్రభావంతో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నవంబర్ 20 నుంచి 22 వరకు తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






కామెంట్‌లు (0)