- స్వర్ణోత్సవ వేడుకలకు భారీగా ఆర్థిక దన్ను
- కళాశాల రుణం తీర్చుకుంటున్న పూర్వ విద్యార్థులు
- రూ. 8 లక్షలకు పైగా నిధుల సమీకరణ
- హైకోర్టు జడ్జి, రిటైర్డ్ ఆర్టీఓ ఔదార్యం
- ఉత్సాహంగా సాగిన జేవీఆర్ కళాశాల స్వర్ణోత్సవ సన్నాహక సమావేశం
నవతెలంగాణ-సత్తుపల్లి
జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సన్నాహక సమావేశం కళాశాల ఆడిటోరియంలో ఆ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ గోపి నండ్రు అధ్యక్షతన ఉత్సాహంగా జరిగింది. కళాశాల ఘన కీర్తిని వివరిస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ గోపి సభను ప్రారంభించి, ప్రతి బ్యాచ్ నుంచి పూర్వ విద్యార్థులు తమ కార్యాచరణను, వేడుకల విజయవంతానికి చేస్తున్న ప్రయత్నాలను వివరించాలని కోరారు. స్వర్ణోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి దారా కృష్ణారావు మాట్లాడుతూ... మొదటి బ్యాచ్ విద్యార్థి అయిన హైకోర్టు న్యాయమూర్తి య్క బీవీరావు స్వర్ణోత్సవాలకు రూ. 3 లక్షలు విరాళంగా ప్రకటించారని కరతాళ ధ్వనుల మధ్య వెల్లడించారు. అలాగే, గతంలో రూ. 50,000 విరాళమిచ్చిన రిటైర్డ్ ఆర్టీవో కృష్ణారెడ్డి జలగం వెంగళరావు విగ్రహ స్థాపన ఖర్చు మొత్తాన్ని తానొక్కరే భరిస్తానని ప్రకటించడం సభలో ఆనందాన్ని నింపింది. కమిటీ అధ్యక్షులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీ నుంచి రూ. 5 లక్షల నిధులు మంజూరైన విషయాన్ని మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ఫయాజ్ సభలో ప్రకటించారు. దీంతో సభలో సభ్యులు అభినందనలు తెలిపారు. వివిధ కమిటీలలో అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం కల్పిస్తే వేడుకలు మరింత విజయవంతమవుతాయని పూర్వ విద్యార్థి కోటూరి మానవతారాయ్ సూచించారు. ఈ సమావేశంలో కార్యక్రమ కన్వీనర్ గాదె నర్సింహారెడ్డి, మొరిశెట్టి సాంబశివ గుప్త, డాక్టర్ పూర్ణచంద్రరావు, కూకలకుంట రవి, అయ్యదేవర శేషగిరిరావు, గొర్ల వెంకట్రామిరెడ్డి, బత్తిన గీతాకుమారి, దొడ్డా కృష్ణయ్య, కొండపల్లి విజయకుమార్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గుండ్రోతు నరసింహారావు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్లు (0)