Magazines

హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, రేట్లు పెంచాలి

21 నిమిషాల క్రితం

should be established for manual laborers, and their wage rates should be increased.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

- ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నిమ్మటూరి రామకృష్ణ 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సీజనల్ హమాలీలుగా పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 'హమాలీ సంక్షేమ బోర్డు'ను ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిమ్మటూరి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో హమాలీలు తరచూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న కార్మిక కుటుంబాలకు ఆసరాగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత, ఇతర ప్రభుత్వ లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అలాగే, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లను తక్షణమే పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు చెన్నారావు, రాము, శ్రీనివాసరావు, ఏచూరి అప్పారావు, చింతల వెంకటేశ్వరరావు, నబి, పుల్లయ్య, నాగేశ్వరరావు, ప్రసాద్, ఏసుబాబు, తిరుమలరావు, కృష్ణ పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్