Magazines

వ్యవసాయ రంగం మార్పులను అధ్యయనం చేయాలి

58 నిమిషాల క్రితం

agricultural
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 2 నిమిషాల చదవడం

భారత్, అమెరికా వ్యవసాయ ఒప్పందాలు నష్టదాయకం :
ఏఐఐడబ్య్లూయూ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల అధ్యయనంతోపాటు వ్యవసాయ కార్మికుల హక్కుల రక్షణ కోసం దేశవ్యాప్తమైన ఉద్యమాన్ని చేపట్టాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. భారతదేశం, అమెరికా మధ్య జరిగిన వ్యవసాయ ఒప్పందాలకు నష్టదాయకమని తెలిపారు. గురువారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాజకీయ శిక్షణ తరగతులలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు వ్యవసాయ కార్మిక వర్గంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదో ప్రజలకు వివరించాలని సూచించారు. యంత్రాలు, కలుపు మందులు, వ్యాపార పంటలు పెరగడం వల్ల వ్యవసాయ కూలీలు రోజువారీగా చేసే పని దినాలు పడిపోయాయన్నారు. ఫలితంగా సగం రోజులు మాత్రమే వ్యవసాయ పనుల్లో పని దొరుకుతుందని, మిగిలిన రోజులు పని కోసం కార్మికులు పట్టణాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


వ్యవసాయ కూలీల హక్కుల కోసం ప్రత్యేకమైన డిమాండ్లతో ఆందోళన పోరాటాలతో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కొత్తగా ప్రాజెక్టులు వచ్చిన దగ్గర భూమి స్వభావాలు వచ్చిన మార్పులు కను గుణంగా భూ పరిమితి చట్టాలలో మార్పు తీసుకురావాలని కోరారు. ‘భారతదేశం, అమెరికా ఒప్పందాల్లో విదేశాల నుంచి పంటలను దిగుమతి చేసుకోవడం వల్ల వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. రానున్న కాలంలో మన పంటలు దివాలా తీసి రైతులు కూడా కూలీలుగా మారే ప్రమాదం ఉందని ఆందళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న కూలీలకు పని కల్పించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పనిని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలన్నారు. దేశంలో పెరుగుతున్న కరువును దృష్టిలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని కోరారు. దీనితోపాటు పదివేల రూపాయలు నగదు సాయం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కరువు అధ్యయనానికి కేంద్ర బృందం దేశవ్యాప్తంగా పర్యటనలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి. నాగయ్య, ఆర్ వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ప్రసాద్, బి పద్మలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్