Magazines

అణగదొక్కాలనే ఆలోచన వద్దు

13 నిమిషాల క్రితం

Do not harbor the intention to suppress.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

వీసీ జానయ్యపై ఆరోపణలు సరికాదు

బహుజన సంఘాల నాయకులు

నవతెలంగాణ - బంజారాహిల్స్

​బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అణగదొక్కాలనే ఆలోచనను మానుకోవాలని, లేదంటే బహుజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని పలువురు బహుజన సంఘాల నాయకులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలోని అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్యపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ శుక్రవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడారు. బీసీలు పరిపాలనా స్థానాల్లో ఉండటాన్ని ఓర్వలేని వారే జానయ్యపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జానయ్య వీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే యూనివర్సిటీ ర్యాంకు 37 నుంచి 17కు మెరుగుపడిందని, భూమి లేని వ్యవసాయ కూలీల పిల్లలకు 15 శాతం రిజర్వేషన్‌ కల్పించారని తెలిపారు. జానయ్య ఒంటరి కాదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం ఆయనకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ మాట్లాడుతూ.. డీజీపీని కలిసి న్యాయం కోరుతామని, రెండు మూడ్రోజుల్లో మేధావులతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి యూనివర్సిటీలో పర్యటిస్తామని చెప్పారు. మానవతారాయ్‌ మాట్లాడుతూ.. ఆరోపణలు చేస్తున్న ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారేనని, వారిని ఏపీకి పంపించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, బీసీ జేఏసీ వర్కింగ్‌ చైర్మెన్‌ గుజ్జ కృష్ణ, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు డాక్టర్‌ శ్రీనివాస్‌, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మెన్‌ కుందారం గణేష్‌ చారి, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్‌ గౌడ్‌, బీసీ జేఏసీ నేతలు పిట్ల శ్రీధర్‌, దితి మల్లయ్య, బీసీ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు రాధారాణి, అగ్రికల్చర్‌ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బిక్షపతి, సంచార జాతుల అధ్యక్షులు కాటేపల్లి వీరస్వామి పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్