సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నవభారత నిర్మాత, భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఘనంగా నివాళులర్పించారు. చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 14న జరుపుకునే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని బాలబాలికలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలల పట్ల నెహ్రూకు ఉన్న అపారమైన ప్రేమ, వారి భవిష్యత్తుపై ఆయనకున్న దూరదృష్టి, విద్యాభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. బాలలే దేశ సంపద, వారే భావి భారత పౌరులనే నెహ్రూ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
బాలల భవిష్యత్తుకు బంగారు బాటలేస్తాం
12 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం
![Why wasn't the Thummidihetti [dam/barrage] built back then?](https://nvtg-prd.sgp1.digitaloceanspaces.com/gaderakishore.tif-1794597979618-d3f781b7-dc87-4ac9-903b-02bbcad34688-360x202.webp)




కామెంట్‌లు (0)