మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నపుడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ఎందుకు కట్టలేదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ కేటీఆర్‌ను విమర్శించే స్థాయి బీర్ల ఐలయ్యకు లేదన్నారు. సింగరేణి, రైతు గర్జన నిర్వహించడంతో ఓర్వలేక కేటీఆర్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. పంటలు వేయొద్దనడమే ప్రభుత్వ విధానమా?అని ప్రశ్నించారు. తమ నాయకుల ఫామ్‌హౌస్‌లకు బస్సు వేసుకుని తిరుగుడు కాదనీ, దమ్ముంటే రైతుల దగ్గరకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఎండిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, నీళ్లు, కరెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. పంటలు పండిస్తే కొనే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత ఒంటెద్దు నరసింహ రెడ్డి, ధర్మేందర్ రెడ్డి, కడారి స్వామి యాదవ్, పడాల సతీశ్, హరిబాబు, మిథున్, శీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
![Why wasn't the Thummidihetti [dam/barrage] built back then?](https://nvtg-prd.sgp1.digitaloceanspaces.com/gaderakishore.tif-1794597979702-9677c3b5-0146-47d3-931c-1edcf9f82277-900x506.webp)





కామెంట్‌లు (0)