మంత్రి పొంగులేటికి చెక్కు అందజేసిన ట్రెసా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎల్‌నినో కరువు నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.ఐదు లక్షలు విరాళంగా ప్రకటించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) నిర్ణయించింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు కె గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎల్ రమన్‌రెడ్డిల ఆధ్వర్యంలో బుధవారం మంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెక్కును అందజేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ప్రజల ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యా, వారికి అండగా నిలవడంతోపాటు ప్రభుత్వానికి సహకరించాలనే సదుద్దేశంతో సామాజిక బాధ్యతగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం ప్రతి ఉద్యోగి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సేవలో రెవెన్యూ ఉద్యోగులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రెసా గౌరవాధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కె నిరంజన్ రావు, రాష్ట్ర సమన్వయకర్త ఎం నారాయణ్ రెడ్డి, సీసీఎల్ఏ అదనపు సహాయ కార్యదర్శి చిన్న వెంకట్ స్వామి, సంయుక్త కార్యదర్శులు ఏఆర్ విక్రమ్, రాజేశ్వర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి, ట్రెసా నాయకులు బాల్ రెడ్డి, అర్చన, భాగ్యలక్ష్మి, గిరిధర్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)