Magazines

పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ అమలు చేయాలి

1 రోజు క్రితం

Employment
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

రోజుకు రూ.800 కూలి.. ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలి

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌

సీఆర్‌డీ కమిషనరేట్‌ ‌వద్ద ధర్నా


నవతెలంగాణ - బంజారాహిల్స్
​రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేయా లని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటరాములు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఆర్‌డీ కమిషనర్‌ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించి, కమిషనర్‌కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య, మాట్లాడు తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, వ్యవసాయ సంక్షోభం, తాగు, సాగునీటి కొరతతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు పనులు దొరకడం లేదని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా ప్రభుత్వాలు నియంత్రిం చడం లేదని, పేదలు జీవనోపాధి లేక ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లోనూ ఉపాధి పనులు కల్పించి, రోజుకు రూ.800 వేతనం, 150 రోజుల పని దినాలు కల్పించాలని కోరారు.


ఉపాధి హామీ పని దినాలను 125 నుంచి 200 రోజులకు పెంచా లని, కొలతలతో సంబంధం లేకుండా వేతనం చెల్లించాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను కొనసాగించా లని, వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని, కేంద్ర బడ్జెట్‌లో రూ.3లక్షల కోట్లు కేటాయిం చాలని కోరారు. ఉపాధి పనుల్లో కూలీలు, మేట్లు, ఎఫ్‌ఏలకు రూ.10 లక్షల ప్రమాద బీమాతో పాటు వైద్య సౌకర్యాలు కల్పించాలని, పనిముట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. మేట్లకు శిక్షణతో పాటు రూ.500 శిక్షణ భత్యం, గుర్తింపు కార్డులు, కిట్లు అందించాలని, సీనియర్ మేట్లను ఎఫ్‌ఏలుగా గుర్తించాలని కోరారు. ఎఫ్‌ఏల వేతనాలు పెంచడంతో పాటు విధుల్లోకి తీసుకోని వారిని తిరిగి చేర్చాలని, మేట్లకు ఉపాధి భద్రత, అదనపు వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు.


రెండు పూటలా హాజరు, ఫొటో విధానాన్ని రద్దు చేసి ఒక్కసారే హాజరు తీసుకోవాలని, ఇంటర్నెట్ సమస్యలను పరిష్కరించాలని, రవాణా చార్జీలు, కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయరాదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు తెలంగాణలోని 23,170 ఆవాసాల్లో ఉపాధి పనులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంఘం ఆధ్వర్యంలో మండల స్థాయి సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు తమ సంఘానికి అవకాశం కల్పించాలని కోరారు. మేట్లకు కూడా చట్టంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కూలీల కన్వీనర్ గొప్పని పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్ బాబు, ఎం.అడివయ్య, రాష్ట్ర నాయకులు సాదుల శ్రీని వాస్, అల్వాల వీరయ్య, కె.జగన్, పెద్ది వెంకట్రా ములు, ఆర్.శశిధర్, ఎం.వెంకటయ్య, ఎం. ఆంజనేయులు, ఎం.నర్సింహులు, ఉడుముల గిద్ద గోపాల్,పి.అంజయ్య పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్