21 ఏండ్ల తర్వాత ఇద్దరూ కలిశారు
సంగారెడ్డి : మాజీ మంత్రి హరీశ్ రావు, తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి దాదాపు 21 ఏండ్ల తర్వాత వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. జగ్గా రెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగ్గా రెడ్డి ఆహ్వానం మేరకు హరీశ్ రావు ఆయన ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘‘2004లో హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కలిసి భోజనం చేసేవాళ్లం. కాంగ్రెస్‌లోకి వచ్చాక ఒకసారి ఎమ్మెల్యేగా కలిశా. 21 ఏండ్ల తర్వాత ఇప్పుడు ఇలా కలిశాం. మా భేటీలో రాజకీయ కోణం లేదు’’ అని జగ్గా రెడ్డి అన్నారు.






కామెంట్‌లు (0)