సంఘమే కావాలన్న నర్సింహాచారి

2 గంటల క్రితం

Narasimhachari insisted
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

ఉద్యోగ విరమణ సభలో ఎస్‌ వీరయ్య అభినందన

ఉద్యమంలో కొనసాగేందుకు అంగీకారం

నవతెలంగాణ-హైదరాబాద్‌

తెలంగాణ వికలాంగుల సంస్థ ఉద్యోగుల సంఘం(ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌- సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.నర్సింహాచారి 30న ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో శనివారం అభినందన సభ నిర్వహించారు. ఇందులో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య , పబ్లిక్ సెక్టార్ నాయకులు నాయకులు యం.జనార్ధన్‌‌రెడ్డి, సహ ఉద్యోగులు,కుటుంబ సభ్యులు పాల్గొని వారి సేవలకుగాను అభినందనలు తెలియజేశారు. నాలుగు దశాబ్దాల తన సర్వీసు కాలంలో నిర్వహించిన పోరాటాలు, చేసిన త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉద్యోగం కావాలో, సంఘం కావాలో తేల్చుకోమని అధికారులు హుకుం జారీ చేస్తే, సంఘమే కావాలని స్థిరంగా నిలబడిన యోధుడు నర్సింహాచారి అని అభినందించారు. మెరుగైన ఉద్యోగాలు వచ్చినా సంస్థపై ఉన్న అభిమానంతో వాటిని వదులుకుని సంఘంలో కొనసాగిన త్యాగశీలి అని అభిప్రాయపడ్డారు. ఎన్ని వడిదుడుకులు వచ్చినా సంస్థను వదలకుండా సహ ఉద్యోగులను ఐక్యం చేసి పోరాడిన ధీశాలి అని వీరయ్య ప్రశంసించారు. ప్రభుత్వ రంగ సంస్థల మనుగడ కేంద్ర ప్రభుత్వ విధానాల నేపథ్యంలో ప్రమాదంలో పడిందనీ, వాటి పరిరక్షణోద్యమంలో నర్సింహాచారి పాల్గొనాలని వీరయ్య విజ్ఞప్తి చేయగా, అందుకు కుటుంబ సభ్యులతో సహా వీరయ్య అభ్యర్ధనను నర్సింహాచారి అంగీకరించారు. ఈ సభకు ఎ.రాములు అధ్యక్షత వహించగా, వెంకట రాములు, ఎస్.రాములు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్